
పులివెందుల: పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలం వైకాపా ఇంచార్జ్ వైయస్ కొండారెడ్డి ని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే పులివెందుల రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్ ఆర్ కే కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ను కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కొండా రెడ్డి ని అదుపులోకి తీసుకొని విచారించి ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరు పరిచినట్లు కడప ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ముద్దాయి కి కోర్టు రిమాండ్ విధించడంతో కడప జైలు కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.