
వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు : తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను గొప్పగా చాటుకునేందుకు తెలుగువారంతా కలసిమెలసి ఉండాలని వెంకయ్య నాయుడు గారు తెలిపారు. అన్నీ తెలుగు సంస్థలను ఒకటే తాటి మీదకు తీసుకురావాలన్న రాష్ట్ర ఇతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు రాష్ట్రతర తెలుగు సమాఖ్య 6 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ నుండి వర్చువల్ ద్వారా ఆయన ప్రసంగించారు.
ఆయన ప్రసంగిస్తూ ఆట, పాట, భాష, యాస, మన కట్టు మన బొట్టు ఇలాంటి సంప్రదాయాలను పునరుజ్జీవింప చేయవలసి అవసరం ఉందని పేర్కొన్నారు. మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి మన సాహిత్యం మన ఆహారపు అలవాట్లు కట్టుబాట్లు అన్ని ముందు తరాలకు దూరమవుతాయని అందుకోసమే తెలుగువారందరూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.