
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 1820 కిలోల గంజాయిని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో అసలు పట్టుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక లారీ, ఒక కారు 41 వేల రూపాయలు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మరియు లారీ విలువ సుమారు 3.07 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మహారాష్ట్రకు చెందిన సంజయ్ లక్ష్మణ్ షిండే 26, సంజయ్ బాలాజీ కాలే 30 వీరిద్దరు సోదరులు. సంజయ్ చోగ్లే 45, భరత్ కాలప్పా యేవ్లే 37 వీరికి స్నేహితులు. అభిమాన్ కళ్యాణ్ పవార్ 49 వీరికి బంధువు లుగా చెప్పారు. అసలు సూత్రధారి లక్ష్మణ్ షిండే సీలేరు లోని సరఫరా దారులతో సంబంధాలు పెట్టుకుని మహారాష్ట్ర సరిహద్దుల వరకు మీరు గంజాయి చేరుస్తారు తర్వాత లక్ష్మణ్ వినియోగదారులకు కావలసిన మేరకు సరఫరా చేస్తున్నాడు. ఈ లోడును ఉస్మానాబాద్ వరకు తీసుకు వస్తే వచ్చే ఆదాయంలో భాగం ఇస్తానని పశ్చిమ బెంగాల్ కు చెందిన డ్రైవర్ షేక్ రషీదుల్ 27 ను ఈ గ్యాంగ్ తో పాటు లక్ష్మణ్ కూడా ఒప్పించాడు. ఈనెల 23వ తేదీన లారీని తీసుకుని సీలేరు వెళ్ళాడు రషీదుల్ . అదే రోజు రాత్రి ఆ వాహనాన్ని వేరే చోటుకు తీసుకెళ్ళి 182 ప్యాకెట్లు ను లారీ లో ఉంచి దానిపై కవర్ కప్పి అవి కనిపించకుండా వాటిపై వర్మీ కంపోస్ట్ బ్యాగులను లోడ్ చేశారు. ఈ లోడ్ ను హైదరాబాద్ శివార్లలోని పతంగి టోల్ప్లాజా వద్దకు గురువారం తెల్లవారుజామున చేరుకున్నారు. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ వో టి ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలోని బృందం అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో లారీని పట్టుకున్నారు. వీరు కిలో గంజాయిని 8 వేలకు కొనుగోలు చేసి 15 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని నిందితులు తెలిపారు.
ఈ గంజాయి రవాణా హైదరాబాద్ మీదుగా ఉత్తర భారతదేశానికి రవాణా చేయడం జరుగుతుంది. మార్గమధ్యంలో హైదరాబాద్లోనూ వీరి వ్యాపారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వన్ కి నా సూచనల మేరకు పోలీసులు గంజాయి రవాణా అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్ లో గురువారం ఒక్క రోజే 3.07 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలలుగా నలభైకి పైగా కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఈ ఏడాదిలో పట్టుకున్న 5000 కేజీల గంజాయి నీ పట్టుకున్నారు. వీటితో పాటు 31 అని అరెస్ట్ చేశారు. ఎన్ డి పి ఎస్ చట్టం ద్వారా ఈ 31 మంది ఆస్తులను ప్రభుత్వం జంతు చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లుగా సి పి వివరించారు.