
ఏపీ సిఐడి అదనపు డిజి సునీల్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్ కుమార్ వ్యవహారంలో వచ్చిన మూడు ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇ సంజీవ్ కుమార్ ఫిర్యాదుపై తీసుకున్న చర్యల పై వివరాలు కోరుతూ లేఖ రాశారు. సునీల్ కుమార్ ఆర్ సి ఎల్ సర్వీసెస్ నియమ నిబంధనలను ఉల్లంఘించారని గతంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ హోదాలో ఉన్న అధికారి ఇ సమాజంలో గోడవలు సృష్టించేలా మాట్లాడాలని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే కేంద్ర హోంశాఖ రఘు రామ కృష్ణంరాజు ఫిర్యాదును, సునీల్ కుమార్ ప్రసంగాన్ని రాష్ట్ర సి ఎస్ కు పంపింది.