
కరీంనగర్: వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 120 కిలోమీటర్ల స్పీడ్ తో కారు చెట్టుని ఢీకొని ముగ్గురు అన్నదమ్ములు తో పాటు డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డారు. మానకొండూర్ ci కృష్ణారెడ్డి ఇ తెలిపిన వివరాలు కరీంనగర్లోని జ్యోతి నగర్ లో వాసం ఉంటున్న పంచాయతీరాజ్ ఈఈ కొప్పుల శ్రీనివాసరావు 58, బాలాజీ శ్రీనాథ్ లాయర్ 55, శ్రీ రాజ్ ప్రైవేట్ ఇంజనీర్ 53 వీరి బావ పెంచల సుధాకర్ రావు 64 కారులో గురువారం బయలుదేరి ఖమ్మం జిల్లా కల్లూరులో మేనమామ లక్కినేని సత్యం పెద్ద కర్మ కు బయల్దేరి వెళ్లారు. అక్కడి నుండి ఇ గురువారం రాత్రి 11 గంటల సమయంలో బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మానకొండూరు ఠానా కు కు కు 100 మీటర్ల దూరంలో కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొని డ్రైవర్ జలంధర్ తో పాటు ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. వెనకాల ఉన్న పెంచల సుధాకర్ రావు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న రీడింగ్ మీటర్ 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్నట్లుగా చూపించింది ముందు ఉన్న రెండు ఎయిర్ బెలూన్ లో తెచ్చుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.