
తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీనివాస ఫోల్డింగ్ బెడ్ లాడ్జి వద్ద నలుగురు వ్యక్తులు కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో వారిలో ఇద్దరిపై మిగిలిన ఇద్దరు దాడిచేయగా ఇద్దరు మృతి చెందారు. మృతిచెందిన వారి వివరాలు జువ్వలపాలెం కు చెందిన దొరబాబు (45) అక్కడికక్కడే మృతి చెందగా , కొబ్బరి తోట కు చెందిన ఎడ్లపల్లి సత్యనారాయణ అలియాస్ మీసాల రాజు (45) ఇతని తణుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దొరబాబు పై రౌడీ షీట్ ఇదివరకే ఓపెన్ అయిందని పలు నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అన్ని కోణాలపై దర్యాప్తు చేస్తున్నామని, దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.