
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సీఐ చంద్రబాబు, నేర విభాగ సిఐ కే జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం సాయంత్రం మహిళ తో పాటు మరో ఇద్దరు అనుమానాస్పదంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది ఈ సమాచారంతో అలర్ట్ అయిన మేము ఎస్సైలు సుధాకర్, శైలజ వారి సిబ్బందితో కలిసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు క్లబ్ హౌస్ అనే యాప్ ద్వారా పరిచయమయ్యారు వీరు తరచూ గచ్చిబౌలిలోని పబ్ లో కలుసుకునీ డ్రగ్స్ గురించి మాట్లాడుకునే వారు. మెహదీపట్నం విజయనగర్ కాలనీకి చెందిన హార్మోని అపార్ట్మెంట్ లో నివాసముంటున్న మహమ్మద్ జమీర్ సిద్దిక్ (28), అల్మాస్గూడ శేషాద్రి నగర్లో నివాసముంటున్న కౌకుంట్ల అఖిల్ (31), హఫీజ్ పేట గోపాల్ నగర్ లోని శ్రీ రెసిడెన్సీ లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రమ్య (32) లుగా అ గుర్తించారు. వారి దగ్గర అ వివిధ రకాల డ్రగ్స్ 9.4 గ్రాములు తో పాటు గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు డిసెంబర్ 31 రాత్రి వేడుకలు జరుపుకునేందుకు రమ్య, జమీర్ ర్ ఈ నెల 9వ తేదీన గోవా కి వెళ్లి డ్రగ్స్ కొన్నారు అని రాచకొండ పోలీసులు తెలిపారు.