
హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సినీనటి నిహారిక భర్త చైతన్య అపార్ట్మెంట్ వాసులకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఏడాది మార్చి నెలలో హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ నుంచి షేక్ పేట వెళ్లే మార్గంలో ఉండే ఓ అపార్ట్మెంట్ లో నిహారిక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు వారికి వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పనుల కోసం ఫ్లాట్ ను ఉపయోగించే వారు. అయితే జిహెచ్ఎంసి నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ సొసైటీలో వాణిజ్యపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా ఫ్లాట్ లోకి వచ్చి వెళ్తున్నారు అని పేర్కొన్నారు. దీనివల్ల కొంగు ఎంతో ఇబ్బంది పడుతున్నామని సదరు అపార్ట్మెంట్ వాసులందరూ బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.