
స్టేషన్ ఘన్పూర్ : ఎక్కువ సమయం ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడుతున్నాడని మందలించిన తండ్రి ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పూర్ మండలం ఉప్పుగల్లు కు చెందిన కోరు కొప్పుల రాజు అనిత దంపతుల కుమారుడు చరణ్ గౌడ్ పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతను క్రికెట్ లో రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాడని తండ్రి ఆదివారం మందలించారు. మనస్థాపానికి గురైన చరణ్ ఆదివారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నాక రాత్రి 11 గంటలకు బైక్ పై స్టేషన్ ఘన్పూర్ వెళ్ళాడు. 12.54 నిమిషాలకు తండ్రి ఫోనుకు వాట్సాప్ ద్వారా ఐ యాం సారీ డాడీ , అమ్మ చెల్లిని బాగా చూసుకొ అని అతను ఉన్నటువంటి ఇ లొకేషన్ని షేర్ చేశాడు. రాత్రి 1.10 గంటలకు నా సమస్యను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని మెసేజ్ పంపాడు. డాడీ మమ్మీ చెల్లి కి ఐ మిస్ యూ అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. అందరూ నిద్రలో ఉండడం ఎంతో ఆ మెసేజ్ ని ఎవరూ చూడలేదు ఉదయం మెసేజ్ చూసిన అనంతరం లోకేషన్ కి వెళ్లి చూడగా తల మొండెం వేరు వేరుగా పడి ఉండడం చూసి ఇ బాధపడ్డారు.