
మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి పంచాయతీ శివారు అడపా వారి పాలెం కు చెందిన అడపా రవిచంద్రకుమార్ వాణి దంపతులకు ఇద్దరు సంతానం వంశీ ప్రియ, సాయి ప్రణవ్. రవిచందర్ వ్యవసాయమే జీవనాధారంగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆయన కుమార్తె ప్రియా మచిలీపట్నం లో ఇంజనీరింగ్ చదువుతోంది. శనివారం ఇంటికి వచ్చింది. కుమారుడు ప్రణవ్ పోయిన వారం విజయవాడలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరి తను కూడా శనివారం ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం వంశీ ప్రియ కాలేజీ బస్సు మిస్ అవడంతో తమ్ముడు ప్రణయ్ (17) బైక్ పై దింపేందుకు వెళుతుండగా చల్లపల్లి మండలం మాజేరు వద్ద ఉన్న టర్నింగ్ కు చేరుకోగానే అదే గ్రామానికి వస్తున్న ఇంకొక బైకు 2 పరస్పరం ఢీకొనడంతో ప్రణయ్ ఎగిరి పడడంతో తీవ్రంగా గాయాలయ్యాయి, వంశీ ప్రియ కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ప్రణవ్ ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ డి సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.