
పిరిగి తాసిల్దార్ కార్యాలయంలో యువకుడు ఆత్మహత్యాయత్నం. జగన్ ప్రభుత్వంలో కూడా అర్హులైన ఓసీలకు న్యాయం జరగడం లేదని స్థానికంగా ఉన్న మంత్రులు ప్రజా ప్రతినిధులు ఎవరో కూడా ఓసీలకు న్యాయం చేయడం లేదని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లో కూడా అర్హులైన ఓసీలకు అన్యాయం జరుగుతుందని మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు.
వివరాల్లోకి వెళితే శాసన కోట కు చెందిన యువకుడు సుధాకర్ రెడ్డి కుమారుడు నవీన్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. నవీన్ శుక్రవారం ఉదయం పిరిగి తహసిల్దార్ కార్యాలయంలో నీ ఎమ్మార్వో వో చాంబర్ వద్దకు చేరుకుని ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న సిబ్బంది తదితరులు అడ్డుకొని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. నవీన్ కుమార్ ఓ సి ల కు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి నుండి టి.మంత్రుల వరకు ఓ సి ల ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదనను లేఖ రూపంలో వివరిస్తూ తాసిల్దార్ సౌజన్య లక్ష్మి కి అందించాలనే ఉద్దేశంతో కార్యాలయానికి వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే ఎమ్మార్వో మాట్లాడుతూ తను ఒక్కసారిగా కింద పడడంతో హాస్పిటల్ కి తరలించామన్నారు అయితే ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు వివరించామని ఆమె తెలిపారు.