
విశాఖ తీరంలోని ఆర్కే బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఐదుగురు యువతీ యువకులు ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చారు. వీరిలో ఒక యువకుడు ఒక యువతి తీరంలో మృతి చెంది కనిపించారు. మిగిలిన ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆర్కే బీచ్ లో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.