
సిద్దిపేట్: ప్రియుడు మోజులో పడి భర్తను హతమార్చిన భార్య ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం చిన్న నిజాంపేట కు చెందిన కోనాపురం చంద్రశేఖర్ 24 కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల 19 తో మార్చి 23 వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. గుడికందుల గ్రామానికి చెందిన శివ కుమార్ 20 శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. విషయం తెలిసిన పెద్దలు ఒత్తిడితో చంద్రశేఖర్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరి పెళ్లి జరిగి 36 రోజులు కాగా ఏప్రిల్ 19న ఆహారంలో ఎలుకల మందు కలిపి భర్తకు తినిపించగా ఆహారంలో తేడా అని భావించిన చంద్రశేఖర్ హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చాడు. అదే అదునుగా ఆలయంలో ముక్కు తీర్చుకోవాలని ఏప్రిల్ 28న బైక్ పై అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదాం అంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళింది. వీరి కోసం ఎదురుచూస్తున్నా శివ అతని స్నేహితులు రాకేష్, రంజిత్, సాయి కృష్ణ, భార్గవ్ లు కారు బైకు అడ్డంగా నిలిపి వేశారు. ఈ నలుగురు అతన్ని పట్టుకుని ఉండగా శివ శ్యామల ఇద్దరూ గొంతు నులిమి చంపేశాడు. అయితే శ్యామల చంద్రశేఖర్ బంధువులకు చాతిలో నొప్పి కారణంగా చనిపోయాడని బంధువులకు తెలియజేసింది. కానీ చంద్రశేఖర్ తల్లి మనేవ్వ, కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో సులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం బయటపడింది . ఈ హత్యకు పాల్పడిన ఆరుగురు 25 సంవత్సరాల లోపు వాళ్లే కాగా వీరిని అరెస్టు చేసి ఆదివారం సిద్దిపేట న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలియజేశారు.