
లోక్ సభ వేదికగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మిథున్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సోమవారం సభ జీరో అవర్లో RRR మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవడం అన్యాయం అన్నారు. ఈ సమయంలో రాజు గారి ప్రసంగానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు అడ్డుతగిలారు. అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా అడుగడుగునా అడ్డుకుంటున్నారని అని ఆరోపించారు. అమరావతి రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని అలాంటివారిని హింసిస్తున్నారు , ప్రజల ప్రాథమిక హక్కులను కూడా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీలో శాంతిభద్రతలు లోపించాయి అని RRR పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. RRR పై సిబిఐ కేసులు ఉన్నాయని వాటి నుంచి బయటపడే దానికోసం బిజెపిలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు గానూ ముందు మీ జగన్ పై ఉన్న సిబిఐ కేసుల సంగతి తేల్చాలని అన్నారు.