
ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది ఈ ఘటన జిల్లాలోని రెబ్బెన మండలం నవేగాం లో జరిగింది. నవెగాం కు చెందిన వేల్పుల ఇందూర్ అలియాస్ ఇంద్ర 18, రాజలింగు వరుసకు అన్నదమ్ములు. ఇంద్ర కొంత కాలంగా ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది అయితే ఆ మహిళతో రాజలింగు కు అప్పటికే ఆ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది ఈ విషయం తెలుసుకున్న అతడు పద్ధతి మార్చుకోవాలని ఇంద్ర ను హెచ్చరించాడు. ఈ విధంగా ఎన్ని సార్లు హెచ్చరించినా అతను పట్టించుకోకపోవడంతో రాజలింగు ఇంద్ర పై కక్ష పెంచుకున్నాడు ఈనెల ఒకటో తేదీన ఇంటి బయట ఉన్నటువంటి చావడిలో కాళ్లు చేతులు కడుక్కునే పనిలో ఏమరుపాటుగా ఉన్నా ఇంద్ర ను గమనించి రాజా లింగు కత్తితో అతని కడుపులో పొడిచాడు తీవ్రంగా రక్తం పోవడం తో కింద పడిపోగా పక్కనే ఉన్న కర్రతో అతని తలపై గట్టిగా కొట్టడంతో ఇంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి మధునయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హత్యచేసిన రాజలింగు ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.