
బేగంపేటలోని టాలీవుడ్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ పబ్బులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 33 మంది పురుషులతో పాటు తొమ్మిది మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇదే పబ్ ను లిబ్సన పేరుతో నిర్వహించిన నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అయితే అదే పబ్ ను పేరు మార్చి నిర్వాహకులు వేణుగోపాల్, సాయి భరద్వాజ్, మేనేజర్ రాము కలిసి రన్ చేస్తున్నారు. ఈ పబ్బులో కురచ దుస్తులు ధరించే మహిళలకు రోజుకు 1000 రూపాయలు ఇస్తూ వచ్చిన మగవారి ముందు డాన్సులు చేయించడం తో పాటు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులు వివరించారు. అదుపులోకి తీసుకున్న వీరిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డిసిపి తెలిపారు.