
మలేషియా: కరోనా లో కొత్త రకాలు కలవరపెడుతున్నాయి. వాటిలో డెల్టా వైరస్ ప్రమాదకరమని అనుకుంటుండగా లామ్డా వేరియేషన్ ఇంకా ప్రమాదకరమని మలేషియా ఆరోగ్యశాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ వైరస్ గత నాలుగు వారాల్లో దాదాపు 35 దేశాలలో దీన్ని గుర్తించారు. అయితే ఈ వైరస్ కారణంగా మొదటగా పెరూ లో గుర్తించారు అక్కడ మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అని మలేషియా ఆరోగ్యశాఖ తెలిపింది. మే, జూన్ నెలలో అక్కడ వెలుగు చూసిన 82% కరోనా కేసులకు ఈ వైరస్ ఏ కారణమని పేర్కొంది. ఇందుకోసం పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) కథనాన్ని ప్రచురించింది. అలాగే చిలి దేశంలో లో 31 శాతం కేసుల్లో నరకం కనిపించింది. ఈ వైరస్ ఎంత మేరకు వ్యాపించి ఉందో తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ దృష్టి సారించాయి. కాగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా వారిలో సుమారు 40 లక్షల మంది మరణించి ఉంటారని అని తెలిపింది.