
తిరుచి: ప్రస్తుత సమాజంలో ఎంతో గౌరవమైన వృత్తిలో ఉంటూ ఆ వృత్తికి కళంకం తెచ్చి ఘటనలు ఈమధ్య తరచూ జరుగుతున్నాయి. ఇదే కోవకు చెందిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తురయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి (17) మార్చి 5వ తేదీన కనిపించకుండా పోయాడని పోలీసువారికి కంప్లైంట్ వచ్చిందని తెలిపారు. వారి తల్లిదండ్రులు ఇంటి నుంచి బయలుదేరి కాలేజీ కి వెళ్తున్నట్టు ఆ పిల్ల వాడు చెప్పాడు అని రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో భయ బ్రాంతులకు గురి అయిన తల్లిదండ్రులు ఆ పిల్లవాడి స్నేహితులకు తెలిసినవారికి ఫోన్ల ద్వారా కనుక్కో గా ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. అలా మార్చి 11 నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కొరకై ఆ విద్యార్థి చదువుతున్న కాలేజీ కు వెళ్లిన పోలీసులు విచారణ జరుగుతుండగా అదే రోజు నుంచి అదే కాలేజీ లో పనిచేస్తున్న లెక్చరర్ షర్మిల కూడా కాలేజీకి రావడంలేదని తెలుసుకున్నారు. ఈ ఎంక్వయిరీ లో ఆ లెక్చరర్ కు ఈ విద్యార్థికి మధ్య రిలేషన్షిప్ కొనసాగుతుందని తేలింది. వారిరువురి ఫోన్లో ఒకటే రోజు ఒకటే టయానికి స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఐ ఎమ్ ఐ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా కొన్ని రోజుల తర్వాత ఆ ఫోన్ లో వేరే సిమ్ వేసి షర్మిల వాడటాన్ని కనుగొని షర్మిలను అదుపులోకి తీసుకొని విద్యార్థి మైనర్ కావడంతో ఆమెపై ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు.