
ఈరోజు ఉదయం 10 గంటల నుండి డిగ్రీ పరీక్షలు ప్రారంభం అయితే ఈ పరిస్థితుల్లో దీనిపై విచారణ చేపట్ట లేమని న్యాయస్థానం వెల్లడించింది. అయితే డిగ్రీ పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది ఇప్పటికే మొదలైన పరీక్ష ల పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దాఖలైన పిటీషన్పై వాదులను విన్న న్యాయస్థానం ప్రస్తుతం మొదలైన పరీక్షలపై వాదనలు వద్దని పేర్కొంది అందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.