
అమరావతి: ప్రభుత్వ విధి విధానాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని అణిచి వేస్తే సహించమని హైకోర్టు స్పష్టం చేసింది. నిజాయితీగా ఎవరైతే మాట్లాడుతారు వారి పక్కన మాత్రమే ఉండవలసిందిగా పేర్కొంది. మీడియా ప్రతినిధులతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన వారిపై నిబంధనలకు విరుద్ధంగా సిఐడి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ కాపీలను 24 గంటల లోపు వెబ్సైట్లో చూపించడం లేదని “టీవీ5” అధిపతి బిఆర్ ఆర్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లోగా అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు లేదా చెప్పాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్ శ్రీరామ్ ను కోరింది. ఎవరైనా వ్యక్తులు రెండు మూడు రోజులు కనిపించకపోతే వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్లు దాఖలు చేస్తున్న విషయాన్ని మేము చూస్తున్నామని చెప్పారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరు పరుస్తున్న విషయం తమ దృష్టిలో ఉందని అని తెలిపింది. ఒకవేళ కేసు నమోదై 24 గంటల్లో ఎఫ్ ఐ ఆర్ అప్లోడ్ అయితే వారి కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు. అయితే కొన్ని పోస్టింగులు చాలా దారుణంగా పెడుతున్నారని కొంతమంది వ్యక్తుల ప్రతిష్టను పూల నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎఫ్ ఐ ఆర్ కాపీల అప్లోడ్ పై పూర్తి వివరాలు సమర్పించే దాని కొరకై 10 రోజుల గడువు ఏ జి కోరడంతో విచారణ వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఏన్ జయసూర్య వీరితో కూడిన ధర్మాసనం నిజాయితీగా అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారు పక్కన ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.