
ఒంటరిగా నిల్చుని అటుగా వెళ్లే వాహనదారుల తో అర్జెంటుగా వెళ్లాలని లిఫ్ట్ అడిగి వారి వాహనం ఎక్కుతుంది. అయితే దారి మధ్యలో దిగి డబ్బులు ఇస్తావా లేకపోతే నాపై అఘాయిత్యం చేయబోయావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తుంది. జల్సాలకు బానిసై ఇలా చేస్తూ పైగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేది. గుర్ల మండలానికి చెందిన 22 ఏళ్ల మహిళ తనకు చదువు అబ్బక పోవడంతో కూలి పనులకు వెళ్ళేది అక్కడ వచ్చే డబ్బులు తనకు సరిపోకపోవడంతో ఇలాంటి పనులకు దిగింది అయితే విశాఖకు చెందిన యువకుడు ఈనెల 21వ తేదీన రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తనను లిఫ్ట్ అడిగి తన దగ్గర నుంచి ఐదువేల రూపాయలు మరియు పావుతులం బంగారం అపహరించి నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు అనంతరం అక్కడ ఉన్నటువంటి సీసీ టీవీ ఫుటేజ్ చూసి ఆమెను గుర్తించి శనివారం అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసును ఛేదించిన రెండవ పట్టణ పోలీసులను డిఎస్పీ అభినందించారు.