
కృష్ణ జిల్లా: వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలోని మందపాడు గ్రామంలో నివసిస్తున్న చుక్క లక్ష్మికి ఆర్థిక సహాయం రూపంలో ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి అయితే ఆమె కుమారుడు శివ అ ఇంటిలో మరమ్మత్తుల కొరకై తల్లిని ఆ డబ్బు ఇవ్వాల్సిందిగా కోరాడు ఆమె నిరాకరించింది. ఈ విషయమ్ పై శనివారం రాత్రి లక్ష్మికి ఆమె కోడలు స్వరూప కి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో స్వరూప తన తలపై బాగా మరుగుతున్న నూనెను పోసింది దీంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం స్వరూప శివ పోలీసులు అరెస్టు చేశారు.