
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని పుడ్డింగ్ పబ్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు ఈరోజు అనుమతించింది. అయితే ఆ ఇద్దరినీ నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పబ్ బాగస్వామి అభిషేక్ మేనేజర్ అనిల్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు చంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వీరిని రేపటి నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.