
పశ్చిమ గోదావరి: జిల్లాలోని కుక్కునూరు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన రాజమ్మ (60) అనే మహిళను ఆస్తి తగాదాల కారణంగా ఆమె కొడుకు వెంకటేష్ కత్తి తీసుకొని ఆమె పై దాడి చేశాడు. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోవడంతో వెంకటేష్ అక్కడినుంచి పారిపోయాడు, కుక్కునూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కొడుకు కోసం గాలిస్తున్నారు.