
ఎవరైనా నకిలీ విత్తనాలు కల్తీ పురుగుల మందులు అమ్మితే రెండేళ్ళ జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.