
జగిత్యాల: ఉన్నత చదువులు చదివిన ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన అక్కడ ఉద్యోగం దొరక్క నిరాశకు గురై పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మండలంలో చోటు చేసుకుంది పోలీసులు మరియు కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చిర్ర లవన్ కుమార్ (27) 4 సంవత్సరాల క్రితం ఎంబీఏ పూర్తి చేశాడు ఉద్యోగం రాకపోవడంతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు అక్కడ పని దొరక్కపోవడంతో 6 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇక ఉద్యోగం రాదని బెంగతో మనస్తాపం చెందిన లవన్ కుమార్ మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.