
విజయవాడ పడమటి లంక కు చెందిన పాతూరి అత్తయ్య (62) పాతూరు నీరజ (56) వీరికి ఒక కొడుకు రాహుల్ సాఫ్ట్వేర్ స్థిరపడ్డాడు. రత్తయ్య కు జి.కొండూరు లో సొంతంగా క్రషర్ ఉంది. తన వ్యాపార భాగస్వామి అయిన వెంకటేశ్వరరావు శ్రీదేవి లకు రత్తయ్య తెలిసిన వారి దగ్గర నుంచి అప్పు ఇప్పించారు. ఆ అప్పు సుమారు మూడు కోట్లకు పైనే చేరింది. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడంతో రత్తయ్య తన ఇల్లు ఇతరత్రా ఆస్తులు అన్ని అమ్మి చెల్లించిన ప్పటికీ ఆ అప్పుకు సరిపోలేదు. రత్తయ్య గుంటూరు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం వద్దా ఉన్న బంధువుల క్రషర్ లో మేనేజర్ గా చేరాడు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేనందున సెలవు పెట్టి ఐదు నెలల క్రితం ఇంటికి వెళ్లాడు. సొంత ఊరిలో ఉండలేక తాడేపల్లి లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ అవమానాలు ఇవన్నీ తీవ్ర మనస్థాపానికి మనోవేదనకు గురైన రత్తయ్య ఆయన భార్య నీరజ ఇరువురు కలిసి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి ఈపూరు మండలం ముప్పాళ్ళ వద్దకు చేరుకునీ అద్దంకి బ్రాంచ్ కాల్వకట్ట పై వారు తీసుకు వెళ్ళిన వాహనాన్ని ఉంచి కాలువలో దూకి మరణించారు. మీరు రెండు రోజుల నుంచి కనిపించడం లేదంటూ రత్తయ్య తోడల్లుడు మంగళవారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు వెళ్లి ఇంటిని పరిశీలించగా అక్కడ సూసైడ్ నోట్ రాసి ఉంది. దానిలో మేము ఇప్పించిన డబ్బులు వెంకటేశ్వరరావు శ్రీదేవి లు తిరిగి చెల్లించకపోవడంతో ఉన్న ఆస్తులన్నీ అమ్మి అప్పులు కట్టాల్సి వచ్చిందని అయినా సరిపోకపోవడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నామని రాశారని తాడేపల్లి సీఐ సాంబశివరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.