
తన బంగారు గొలుసు తాకట్టు పెట్టి కరోనా నివారణ నిధికి విరాళాలు ఇచ్చిన యువతికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉద్యోగం కల్పించారు పేదరికంలో బతుకుతూనే నివారణ నిధి కోసం తన మెడలో ఉన్న 2 సవర్ల గొలుసు తాకట్టు పెట్టి ఆ డబ్బును విరాళంగా ఇచ్చిన తమిళనాడు యువతికి అదృష్టం వరించింది.ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలతో ఆమెకు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం లభించింది. ఈ నెల 12న మెట్టూరు వెళ్లిన సందర్భంగా నామక్కల్ కు చెందిన సౌమ్య అనే యువతి ఆయన్ని కలిసింది తన బంగారు గొలుసు తాకట్టు పెట్టిన సొమ్మును కరోనా నివారణ నిధికి విరాళంగా ఇచ్చిన సౌమ్య తన గోడును ముఖ్యమంత్రికి లేఖ రూపంలో తెలియజేసింది.
తాను పేద కుటుంబం అని తను ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదని తండ్రి కి వచ్చే పింఛన్ తో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని సౌమ్య తెలిపింది తనకు ఏదైనా ఉద్యోగం చూపిస్తే కుటుంబాన్ని పోషించుకుంటూ అని వేడుకుంది తన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ సౌమ్య మంచి మనసు ముఖ్యమంత్రిని కదిలించింది.
ఆమె తాకట్టు పెట్టిన బంగారు గొలుసును విడిపించడం మే కాకుండా ఉద్యోగం చూపించాలని స్టాలిన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రైవేట్ సంస్థలో సౌమ్య కు 17 వేల జీతంతో మంచి ఉద్యోగం లభించింది నియామక పత్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఆమెకు అందజేశారు అనంతరం ఫోన్లో ముఖ్యమంత్రితో మాట్లాడించారు తన కష్టం తెలుసుకున్న ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఉద్యోగం ఇప్పించడం తో సౌమ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టి కొద్దిరోజుల్లోనే అట్టి పరిపాలన మానవత్వం తోను ప్రజలకు మేలు చేస్తున్న స్టాలిన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.