
టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్కు వెళ్ళే తమిళ క్రీడాకారులకు సీఎం స్టాలిన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బంగారు పతకం గెలిచిన వాళ్లకు 3 కోట్ల రూపాయలు, వెండి పతకం గెలిచిన వారికి రెండు కోట్ల రూపాయలు, కాంస్య పథకానికి కోటి రూపాయలు బహుమతులు ఇస్తానని తెలిపారు. అలాగే తమిళనాడు రాష్ట్రంలో నాలుగు చోట్ల పొలం పిక్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు కరోనా వ్యాక్సినేషన్ ఈ కార్యక్రమం శనివారం చెన్నైలోనీ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం స్టాలిన్ పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ కు వెళుతున్న ఏడు మంది క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఆటలా కాకుండా సత్తా చాటాలని ఆకాంక్షతో ముందుకు సాగితే పథకాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నివేళలా కట్టుబడి ఉందన్నారు.