
చెన్నై: కమలహాసన్ కరోనా బారి నుంచి రికవరీ అవుతున్నారని శృతిహాసన్ ట్వీట్ చేశారు. మా తండ్రి గారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలో అందరితో మాట్లాడతారని తెలిపారు. కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ ని శ్రీ రామచంద్ర హాస్పిటల్ విడుదల చేసింది ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపింది.