
హైదరాబాద్: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. నాలుగు రోజులుగా హైదరాబాదులోని ఏ ఐ జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఆయన ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు డాక్టర్లు తెలిపారు. మాస్టర్ గారి భార్యకు, పెద్ద కుమారుడికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన పెద్ద కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. శివ శంకర్ మాస్టర్ గారు దేశంలోని సుమారు 10 భాషల్లో కొరియోగ్రఫీ చేసి ఉన్నారు. ఆయన సుమారుగా 800 చిత్రాలకు పైగానే డాన్స్ మాస్టర్ గా పని చేశారు.