
మంచిర్యాల జిల్లాలో కరెంటు తీగలు యమ పాశాలు గా మారాయి. జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో కరెంటు తీగలు తెగి పడి 30 బర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన గ్రామ పొలిమేరలో జరిగింది ఈ బర్రెల కు కాపలాగా ఉన్నటువంటి ఇద్దరు కాపరులు నిమిషంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయితే తే.గీ కాలంచెల్లిన తీగలను మార్చాల్సిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అక్కడి ప్రజలు వాపోయారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంటు శాఖలతో కేవలం గడిచిన ఈ ఆరు నెలలు 375 పశువులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది.