
గుజరాత్ : సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచంలో ప్రతి ఏటా సెల్ఫీ మరణాలలో మా దేశం వాటా ఎక్కువగానే ఉంది. పైగా వర్షాకాలం సమయంలో ఈ ప్రాంతాలకు జనం క్యూ కడతారు ఆ సమయంలో అనేక మరణాలు జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని దంగ్ జిల్లా అధికారులు ఈ విధంగా నోటీసులు జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సెల్ఫీలు దిగితే జరిమానా తో కూడిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పురా లాంటి టూరిస్ట్ ప్రదేశాలు సెల్ఫీలు దిగడం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు జూన్ 23న అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాలలో బట్టలు ఉతకడం ఈత స్నానం చేయడం కూడా నిషేధించి నట్లు తెలిపారు. 2019లో వాగై సాపుతర హైవేపై సెల్ఫీలు దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో టూరిస్ట్ ప్రాంతాలకు కు ప్రజలు పోటెత్తుతున్నారు ఈ నేపథ్యంలో సెల్ఫీ లను తీసుకోవడం నిషేధం అని రావడం కొసమెరుపు.