
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం ఆధ్వర్యంలో సమీక్ష నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టు 15 లోపు నాడు నేడు కింద పెయింటింగ్ పనులు పూర్తిచేయాలని అని సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఉంటాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.