హైదరాబాద్: కృష్ణా నగర్ లోని సాయి కృప పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బంజారా హిల్స్ స్పందిస్తూ పదోతరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు క్రికెట్ ఆడుతూ గొడవకు దిగారు. ఆ గొడవ తీవ్రరూపం దాల్చి తరగతి గదిలోనే దాడి చేసుకున్నారు ఈ గొడవలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ విద్యార్థిని హాస్పిటల్కు తీసుకువెళ్ళగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ గొడవకు గల కారణాలు ను మిగిలిన విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు.