
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎండి ద్వారకా తిరుమల రావు ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితులలో డీజిల్ ధరలు భారం కావడంతో మరియు యు.కె అరుణ ప్రభావంతో ఆదాయం తగ్గిందన్నారు. ఇదివరకు లాగా కొనసాగితే ఆర్టీసీ కోలుకునే పరిస్థితి లేదని అందుకనే రేట్లు పెంచాల్సి వచ్చిందని తెలియజేశారు. ఇది పూర్తిగా డీజిల్ పై విధించే సెస్ మాత్రమే నని టికెట్ రివిజన్ కాదన్నారు. పెంచిన ధరలు పల్లె వెలుగు బస్సు పై 2 రూపాయలు, ఎక్స్ ప్రెస్ పై 5 రూపాయలు, ఏసీ బస్సులపై 10 రూపాయలు పెంచామని పెంచిన ధరలు ఏప్రిల్ 14 అనగా రేపు గురువారం నుంచి అమలులోకి రానున్నాయని ఎండి తెలిపారు.