
హైదరాబాద్ : సీతక్క పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటే కుర్చీ ఉన్న సందర్భంలో ఎవరినైనా కూర్చోబెట్టవలసిన పరిస్థితి వస్తే సీతక్క నే కూర్చో పెడతా అని తెలిపారు.
పిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేశారు. అప్పుడు ఎమ్మెల్యే సీతక్క తనతో సరిసమానం అని రేవంత్ రెడ్డి కొనియాడారు. సీతక్క తనకు రాబోయే రోజుల్లో అండగా ఉందని. సీతక్క కలిసి రాష్ట్రం నలుమూలల తిరగాల్సి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ని కలవడానికి ముందు సీతక్క తన అనుచరులతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని రేవంత్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు చేయించి రేవంత్ రెడ్డి గారిని కలిసారు.