
టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసు లకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. గొట్టిపాటికి చెందిన కిషోర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కి సంబంధించిన రెండు కంపెనీల క్వారీలలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో లో భారీ జరిమానా విధిస్తూ గనుల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది 50 కోట్లు రూపాయలు కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసును హై కోర్ట్ సింగిల్ బెంచ్ కొట్టి వేయగా ఆ తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కంపెనీలకు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గొట్టిపాటి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ఈ పిటిషన్లపై సోమవారం ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఆ తీర్పుపై స్టే విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే రవి కుమార్ కు ఊరట లభించింది.