
ప్రొద్దుటూరు:- మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు కుట్ర లో అవినాష్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉంది అని నిరూపిస్తే నాతోపాటు జిల్లాలోని మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సిబిఐకి సవాల్ విసిరారు.
మంగళవారం పొద్దుటూరు లోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన మరణానికి కారణం అవమానం,డబ్బు,వ్యక్తిగత బలహీనతలే కారణమని చెప్పారు.ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా మహేశ్వర్ రెడ్డి, దస్తగిరి వీళ్లే హత్యకు కారకులని చెప్పారు. మొదట దర్యాప్తులో భాగంగా సిబిఐకి మరియు పోలీసువారికి గంగిరెడ్డి దస్తగిరి లు ఇచ్చిన స్టేట్మెంట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డి పేర్లు లేవు. తర్వాత పొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఎర్ర గంగిరెడ్డి ఆయనకు చెప్పినట్లు ఆ నలుగురు పేర్లు చెప్పారు ఈ రెండు స్టేట్మెంట్ లకు పొంతన లేదు అని రాచమల్లు గారు చెప్పారు.
దస్తగిరి అప్రూవర్ పిటిషన్పై కౌంటర్ దాఖలు నేడు : వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్పై న్యాయవాదులు ఈరోజు అనగా బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడు దస్తగిరి ఇ అప్రూవర్గా మారుతున్నాడు అని అతని సాక్ష్యం నమోదు చేయాలని అక్టోబర్ 22న కడప సబ్ కోర్టులో సి.బి.ఐ పిటిషన్ వేసింది ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమా శంకర్ రెడ్డి కి కూడా సిబిఐ నోటీసులు పంపింది, దాంతో కౌంటర్ దాఖలుకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పత్రాలను ఇవ్వాలని ఈ ముగ్గురు తరుపు న్యాయవాదులు కోరారు. సి.బి.ఐ ఈ నెల 13వ తేదీన కోర్టు ఆదేశాల మేరకు వాటిని అందజేశారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై కడప సబ్ కోర్టులో 19 కు వాయిదా పడింది.