
ఈ భూమి మీద ఎన్నో వింతలు విచిత్రాలు దాగి ఉన్నాయి. భూమి మీద ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు కానీ కానీ ఇప్పటివరకు ఒక గ్రామంలో మాత్రం వర్షం కురవలేదు. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది ఇది అనేది చూద్దాం. ప్రపంచంలో అత్యధిక వర్షాలు మేఘాలయ లోని మాసిన్రామ్ గ్రామంలో కురుస్తుందని మనకు తెలిసిన విషయమే , కానీ అసలు వర్షం కురవని గ్రామం “అల్- హుతైబ్” ఈ గ్రామం యేమెన్ రాజధాని సనా కు పడమర ఉంటుంది. కాగా ఈ గ్రామం భూమి నుంచి సుమారు 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉంటుంది దీని ప్రకారం మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉందన్నమాట. అందువల్లనే ఈ ప్రాంతంలో వర్షం కురవడం లేదు. ఈ గ్రామం వాతావరణం ఉదయం ఎండగా, రాత్రి సమయం చలిగా ఉంటుంది. ఈ గ్రామాన్ని చూడడానికి టూరిస్టులు ఎక్కువగానే వస్తుంటారు.