
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే, అయితే ఆ వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ సహాయ నిధిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనపై పలువురు నటనలోనే కాదు సహాయం చేయడంలో కూడా బాహుబలి అని కొనియాడారు.