
మంత్రివర్గ జాబితాను పాండిచ్చేరి సీఎం రంగస్వామి సిద్ధం తన పార్టీకి చెందిన ముగ్గురు తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఈ జాబితాను రెండు రోజుల్లో ఎల్ జి తమిళ సై సౌందరరాజన్ కు సమర్పించనున్నారు. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి బిజెపితో కలిసి ఇ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తొలుత బీజేపీతో సీట్ల పంపక వివాదాల నడుమ సాగింది. అధికారంలోకి వచ్చి ఒకటిన్నర నెల కావస్తున్నా ఇంతవరకూ మంత్రివర్గం సభ్యులను వెల్లడించ లేని పరిస్థితి.
గత వారం బీజేపీకి చెందిన ఎన్బలం సెల్వం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వర్గ సభ్యుల పంచాయతీ ఒక కొలిక్కి రావడంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న పనిలో నిమగ్నమైన రంగన్న. ఇదే సమయంలో తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదన్న సమాచారంతో బిజెపికి చెందిన జాన్ కుమార్ ఆర్ డి లో చర్చలు జరుపుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న శరవణ కుమార్ కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జాబితాను తయారు చేస్తున్న రంగన్న.