
భువనేశ్వర్: పాము విషం అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్న ముఠాను గుట్టు రట్టు చేశారు. ఈ సమాచారాన్ని ముందుగా అందుకున్న పోలీసులు అప్రమత్తమై ఈ ముఠాలో ఇద్దరు సభ్యులను స్టేషన్ కి తరలించారు. వారి దగ్గర్నుంచి ఒక కిలోగ్రాము పాము విషం ని స్వాధీనం చేసుకున్నారు దాని విలువ సుమారు 1.50 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు పట్టుకున్న విషాన్ని పరీక్షల నిమిత్తం ప్రయోగశాల కు తరలించారు. దొరికిన ఇద్దరు నిందితులలో ఒకరు సంబల్పూర్ జిల్లా సింధూర్ పంక్ గ్రామస్తులు కైలాస్ సాహూ, సఖిపొడా గ్రామస్తుడు రంజన్ కుమార్ పాడి ఉన్నారు. ఈ విషాన్ని దేవఘడ్ ప్రాంతంలో విక్రయించేందుకు చూస్తుండగా పోలీసులు దాడి చేసి వీరిని పట్టుకున్నట్లు సమాచారం. ఈ విషాన్ని ఇతర రాష్ట్రాల నుంచి సేకరించిన పాముల నుంచి తీసిన విషంగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.