
అమరావతి రైతులకు తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతినీ నిరాకరించారు. ఈ మహా పాదయాత్ర మరికొద్ది రోజుల్లో పూర్తవనుంది. అయితే ముగింపు రోజున భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కార్యాచరణ చేశారు. అయితే ఈ సభకు తిరుపతి పోలీసులు అనుమతులు ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇచ్చాము అన్నారు. దానికి ఆంక్షలకు సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టు వారి అనుమతి తెచ్చుకుంటామని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి మీపై 42 కేసులు నమోదైనవి అందువలన మీకు ఎందుకు ఇవ్వాలంటూ తిరిగి ప్రశ్నించారు.