
నెల్లూరు : గూడూరులో సంచలనం సృష్టించిన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం వెనుక ఉన్న మిస్టరీ పోలీసులు చేధించారు. తేజస్విని వెంకటేష్ హత్య చేసినట్లు పోస్టుమార్టం అనంతరం పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డిఎస్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తేజస్విని మెడపై కత్తితో పొడిచి టవల్ తో గొంతు నులిమి చంపాడు తర్వాత ఫ్యాన్ కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని తెలిపారు. అయితే గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ రామాయణం జరిగినట్టు తేలింది. గత కొంత కాలంగా వీరిద్దరూ రంగా ఉంటున్నట్లు విచారణలో తేలింది అయితే అది హత్య వెనకాల మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కాగా వెంకటేష్ పై మర్డర్ కేస్ నమోదు చేసినట్లు తెలిపారు. తేజస్విని కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు శుక్రవారం పరామర్శించారు.