
ఒడిస్సా: ఇతని టార్గెట్ భర్త నుంచి విడాకులు తీసుకున్న వాళ్ళు, ఒంటరిగా ఉన్న మహిళలు వారి వివరాలను వెబ్సైట్లలో సేకరించి 7 రాష్ట్రాలలో 14 వివాహాలు చేసుకున్నాడు. కేంద్రపర జిల్లా పాట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికి 48 సంవత్సరాలు. ఆ వ్యక్తికి 1982 లో లో మొదటి వివాహం జరిగింది 20 ఏళ్ల తర్వాత 2002 లో లో రెండో పెళ్లి చేసుకున్నాడు వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. 2002 నుంచి 2020 మధ్యకాలంలో మ్యారేజ్ బ్యూరో ల ద్వారా మహిళలతో పరిచయాలు ఏర్పరచుకొని ఒకరికి తెలియకుండా ఒకరు తో సన్నిహితంగా మెలిగారు భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఉమాశంకర్ దాస్ అన్నారు. అతని 14వ భార్య ఢిల్లీలో స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది ఆమెతో కలిసి భువనేశ్వర్లో కాపురం ఉంటున్నాడు. అతని నిజ స్వరూపం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు ఆధారంగా అతనిని అరెస్టు చేశారు.
. ఇతడి మాయ లో ఉన్న మిగిలిన వారందరికి అతను ఒక డాక్టర్ అని చెప్పుకుంటూ లాయర్లను, విద్యావంతులను బుట్టలో వేసుకున్నాడు వీరి జాబితాలో మిలటరీలో పనిచేసే మహిళ ఉండడం గమనార్హం. అతను పంజాబ్, జార్ఖండ్, ఒడిస్సా, ఇలా ఏడు రాష్ట్రాలకు సంబంధించిన 14 మందిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అతని వద్ద 11 ఏటీఎం కార్డులు, 8 ఆధార్ కార్డులు ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఇతడు గతంలో బ్యాంకు రుణాలు ఎగవేత కారణంగా అరెస్టు కూడా చేశారు. ఆఖరి భార్య ఫిర్యాదుతో ఇతని బండారం బయట పడడంతో సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.