
విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాం పురం గ్రామంలో నీ కొంతమందికి పింఛన్ రేషన్ నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే 2020 డిసెంబర్ లో రైతు భరోసా సాలూరు మండలం లోని కొదమ పంచాయతీలో రైతులకు పడాల్సిన రైతు భరోసా 13,500 రూపాయలు చొప్పున శివరాంపురం గ్రామంలోని కొంతమంది రైతుల ఖాతాల్లో జమ అయింది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు అప్పుడే తగు చర్యలు తీసుకున్నారు. శివరాంపురం గ్రామానికి వెళ్లి పొరపాటున మీ ఖాతాలో జమ అయిందని తిరిగి వెనక్కి ఇవ్వాలని అధికారులు అడిగారు. అయితే గడిచిన 11 నెలల్లో మొత్తం 247 మంది కి గాను 59 మాత్రమే డబ్బులు తిరిగి చెల్లించారు కాగా మిగిలిన 188 మంది చెల్లించలేదు. ఈ డబ్బులు వారి దగ్గర నుంచి వసూలు చేసే దాని కొరకై వారికి లబ్ధి పొందుతున్న పథకాలను మరియు రేషన్ పింఛన్ నిలిపివేయాలని తాసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు.