
విశాఖపట్నం: విశాఖ నగరంలో పలుచోట్ల చెత్త పన్ను ఇంత వరకు వసూలు కాకపోవటంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త సర్కులర్ జారీ చేశారు. ఉద్యోగులకు కేటాయించిన మొత్తం వసూళ్లలో కనీసం 50 శాతం వసూలు చేయకపోతే వారి జీతాల్లో కోత విధించి ఆ వచ్చిన దాన్ని కార్పొరేషన్ నిధులలో కలుపుతామని జోనల్ కమిషనర్ పేరిట ఒక సర్కులర్ జారీ అయినది. ఈ సర్కులర్ పై పారిశుద్ధ్య వార్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.