
కందుకూరు: చెడు వ్యసనాలకు బానిసలై కొందరు ముఠా గా ఏర్పడి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఢిల్లీకి కార్లలో గంజాయిని తరలిస్తారు . అక్కడినుంచి మద్యం తీసుకువచ్చి అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఈ రవాణాపై నిఘా ఉంచిన పోలీసులు వీరిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ రవాణా కొరకై కారు లోపల కొన్ని ప్రత్యేక గదులను తయారుచేసి వాటిలో తరలిస్తున్నట్లు గా కనుగొన్నారు. ఈ ముఠాలోని ఇద్దరు నీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కార్లలో 105 కేజీల గంజాయి 8 మద్యం సీసాలు పట్టుకున్నారు. సుమారు వాటి విలువ 10 లక్షల రూపాయలు ఉండవచ్చని కందుకూరు పోలీసులు తెలిపారు.