
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లి కూరగాయల మార్కెట్ లో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం కిలో మునగకాయలు 600 రూపాయలు ధర పలికింది. మునగకాయలు కిలో కి 12 నుంచి 20 కాయలు వస్తాయి. ఈ లెక్కన ఒక్కొక్కటి 30 రూపాయల పైనే ఉంటుంది గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో మునగ చెట్లు పూర్తిగా దెబ్బతినడంతో తమిళనాడు నుంచి కాయలు దిగుమతి చేసుకున్నారు. మిగిలిన కూరగాయలు వంగ, బీర ,కాకర, బీన్స్, బెండ, ముల్లంగి, మొటిక కూరగాయలు కిలో సుమారు 80 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయి.